చిట్టీలు, మనీ స్కాం కేసు : హీరా గోల్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ నౌహీరా అరెస్ట్

హైదరాబాద్ : చిట్టీలు, మనీ స్కాం కేసులో తప్పించుకు తిరుగుతున్న హీరా గోల్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ నౌహీరా బేగం మంగళవారం (అక్టోబర్-16) ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు సీసీఎస్‌ పోలీసులు. వారంట్ పై హైదరాబాద్ కు తరలించారు. ఎక్కువ శాతం వడ్డీ చెల్లిస్తామని వినియోగదారులకు ఆశచూపి.. హీరా గోల్డ్‌ దేశవ్యాప్తంగా వందల కోట్లు డిపాజిట్లు సేకరించింది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో హీరాగోల్డ్ పై కేసులు నమోదు అయ్యాయి.

మొత్తం 16 కంపెనీల పేరుతో భారీ మోసం జరిగిందని గుర్తించిన పోలీసులు.. 160 బ్యాంకుల్లోని అకౌంట్స్‌తో ఈ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తెలంగాణ డిపాజిట్ ఆఫ్ ఫైనాన్ షియల్ ఇష్టబ్లిష్మెంట్ ఆక్ట్ లో 1999 కిందా 406, 409, 420, 506 కేసులు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. బంజారహిల్స్ లో 2012లో కేసు నమోదయ్యిందని.. నిదితురాలిపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయన్నారు. కర్ణాటక పోలీసులతో కలసి దర్యప్తు చేస్తామని చెప్పారు హైదరాబాద్ పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates