చిట్టీల్లో నష్టమే కారణమా! : కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు

son-killed-momహైద్రాబాద్ ఎల్లారెడ్డిగూడలో బుధవారం (జూన్-27) రాత్రి దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలకు కారణమైందని కన్నతల్లిని కిరాతకంగా హత్య చేశాడు కొడుకు. ఎల్లారెడ్డిగూడ కేవీఆర్ ఎన్ క్లేవ్ లోని అపార్ట్ మెంట్ లో ఉండే మమత, శ్రీనివాస్ దంపతులకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిట్టీల వ్యాపారం చేసే మమత అందులో నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతుంది. ఇదే విషయంపై భర్త శ్రీనివాస్, కొడుకు మదన్ మమతతో గొడవ పడుతున్నారు. ఇంటి సమస్యలకు మమతే కారణమని ఆరోపిస్తూ గొడవ పడేవారని తెలుస్తుంది.

15 రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిన మమత బుధవారం రాత్రే తిరిగి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గొడవ పడ్డారు భర్త, కొడుకు. మమతను అపార్ట్ మెంట్ టెర్రస్ పైకి లాక్కెళ్లాడు కొడుకు మదన్. ఆమె తలపై కర్రతో కొట్టి.. తర్వాత గొంతు నులిమి చంపేసినట్టు తెలుస్తుంది. మమతను ఆమె భర్త శ్రీనివాస్, కొడుకు మదనే కలిసి చంపేశారని ఆరోపిస్తున్నారు బంధువులు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీమార్చురీకి తరలించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates