చిట్టీల యుద్ధం : మహిళల కొట్లాట – భయంతో ఒకరి ఆత్మహత్య

blచిట్టీల వివాదంతో ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకోగా..మరో మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.  సోమవారం (ఫిబ్రవరి-12) పటాన్‌చెరు మండలం BDL టౌన్‌షిప్‌లోని 321 క్వార్టర్లో అనిత, వెంగళ హిమసుధలు పక్కపక్క నివాసం ఉంటున్నారు. వీరిద్దరు కొన్నిరోజులుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఈ చిట్టీల విషయంలో వివాదం తలెత్తడంతో.. ఆవేశంలో హిమసుధ, అనిత గొంతు కోసి హత్యచేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత భయపడిపోయి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. గాయపడిన మహిళను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై భానూరు BDL పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates