చిత్తశుద్ది లేకనే ఉత్తరాంధ్ర వెనుకబాటు: పవన్‌

pawan-kalyanరైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు  జనసేన అధినేత పవన్ కల్యాణ్. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నేతలు మాటలు మార్చారని… అందుకే తాను జనంలోకి వచ్చానన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ రైతుల సమస్యలు పరిష్కారం కావాలన్నారు. రైతులు కంటతడి పెడుతుంటే.. ఎంతో బాధగా ఉందన్నారు. అసలు ఆ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదన్నారు. అంతేకాదు హోదాపై మొదటి నుంచీ ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేది కాదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిని అటకెక్కించారన్నారు.

అడవి బిడ్డలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని… పాలకొండలో సమస్యలన్నింటిపై జనసేన పోరాటం చేస్తుందన్న పవన్.. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలైన విద్య, వైద్య సదుపాయాల్లేవని ఆరోపించారు జనసేనాని.

Posted in Uncategorized

Latest Updates