చిత్తూరులో దారుణం.. డ్రైనేజీలో ఊపిరాడక ఏడుగురు మృతి

16brk79aచిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం (ఫిబ్రవరి-16) డ్రైనేజీని శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర  కోళ్లఫారం కంపెనీలో ఈ ఘటన జరిగింది. వీరంతా కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్నారు.

ఈ ఉదయం కంపెనీకి వచ్చిన వెంటనే సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయాల్సిందిగా యజమాన్యం ఆదేశించింది. దీంతో మొత్తం 8మంది కూలీలు అందులోకి దిగారు. అయితే అందులో ఉన్న బురదలోకి కూలీలు కూరుకుపోవడంతో ఊపిరి ఆడక ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రెడ్డప్ప, రమేష్, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకటరాజుగా గుర్తించారు. తీవ్ర అస్వస్థతకు గురైన శివ అనే వ్యక్తిని వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం పలనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువుల ఆర్తనాదాలతో పలమనేరు ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates