చిదంబరంకు CBI నోటీసులు

CHIమాజీ కేంద్ర మంత్రి చిదంబరంకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. INX మీడియా మనీ లాండరింగ్  కేసులో ప్రశ్నించేందుకు జూన్‌ 6న విచారణకు హాజరు కావల్సిందిగా చిదంబరంను దర్యాప్తు సంస్థ కోరింది. అవినీతి కేసులో చిదంబరంను జులై 3వరకూ అరెస్ట్‌ చేయరాదని CBIకి గురువారం (మే-31) కోర్టు సూచించింది.

INX మీడియా లో 2007లో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించడంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రపై ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుల్లో అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం బుధవారం(మే-30) ఢిల్లీలో రెండు కోర్టులను ఆశ్రయించారు. జూన్‌ 5న తదుపరి విచారణ జరిగే వరకూ చిదంబరంను అరెస్ట్‌ చేయరాదని వీటిలో ఓ కోర్టు దర్యాప్తు సంస్థ ఈడీని ఆదేశించింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఫిబ్రవరి 28న అరెస్ట్‌ అయిన చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

Posted in Uncategorized

Latest Updates