చిదంబరాన్ని అరెస్టు చేయవద్దు: హై కోర్టు

INX మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరాన్ని సెప్టెంబర్‌ 28వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎకె పాఠక్‌ ఆదేశాలు జారీ చేశారు. చిదంబరం దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌పై విచారణ సందర్భంగా చిదంబరాన్ని సెప్టెంబర్‌ 28 వరకూ అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు వారాల్లోగా తమ సమాధానాన్ని తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను జస్టిస్‌ పాఠక్‌ ఆదేశించారు.

 

Posted in Uncategorized

Latest Updates