చినుకులు కాదు.. వానలో చేపలు కురిశాయ్..

పెథాయ్ తుపాను తూర్పుగోదావరి జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, ఖాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటశాల మండలాల్లో పల్లపు ప్రాంతాల్లో కోతకోసిన వరిపంట సుమారు 10 వేల ఎకరాల్లో నీట మునిగింది. 40 వేల ఎకరాల్లో వరిపైరు గాలులకు నేలకొరిగింది. అవనిగడ్డ -91.4 మి.మీ, నాగాయలంక-70.2 మి.మీ, కోడూరు-30.6 మి.మీ, చల్లపల్లి -91.2 మి.మీ, ఘంటశాల- 64.2 మి.మీ, మోపిదేవి-75.6 మి.మీటర్లు  వర్షపాతం నమోదైంది.

ఈదురు గాలుల దెబ్బకు… కరెంట్ స్తంభాలు , భారీ చెట్లు విరిగిపడ్డాయి. పలు రహదారుల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో… అమలాపురంలోని మున్సిపల్ పాఠశాల దగ్గర చేపల వర్షం కురిసింది. వర్షంతోపాటే… చేపలు చినుకుల్లా రాలిపడ్డాయి. బలమైన సుడిగాలులకు సముద్రపు నీటితో పాటు… చేపలు కూడా గాల్లోకి చేరి.. వర్షంలా మరో చోట పడ్డాయి.

 

Posted in Uncategorized

Latest Updates