చిన్నారికి జనసేనాని భరోసా

pawanవిశాఖలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఓ నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం అందించారు. రేవతి అనే చిన్నారి కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె శరీరంలోని ఒక్కో అవయవం చచ్చుబడిపోతోంది. చికిత్స చేయించుకునే స్థోమత లేక చిన్నారి తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారని తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు తమ కూతురు రేవతికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో చలించిన జనసేనాని తనవంతు సహాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాదు వారి ఇంటికెళ్లిన పవన్… ఆ చిన్నారిని ఆప్యాయంగా ఒడిలోకి కూర్చోబెట్టుకుని మాటలు చెప్పారు. చిన్నారి కూడా ఎంతో సంతోషంగా పవన్ కు కబుర్లు చెప్పింది.

రేవతికి ఆర్థిక సాయంతో పాటు బ్యాటరీతో నడిచే వీల్ చైర్ ను జనసేన తరుపున ఇస్తామని పవన్ భరోసా ఇచ్చారు. పవన్‌ తన కుమార్తె కల నెరవేర్చారంటూ చిన్నారి తల్లి ధన్యవాదాలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates