చిన్నారిపై.. 7 నెలలుగా.. : అపార్ట్ మెంట్ సిబ్బంది మొత్తం అత్యాచారం

చెన్నై మహానగరంలో మహా దారుణం. 12 ఏళ్ల చిన్నారి.. ఏడో తరగతి చదువుతుంది.. చెన్నై సిటీలోని పురసవల్కం ఏరియాలో ఉండే గేటెడ్ కమ్యూనిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం.. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు.. దీంతో అపార్ట్ మెంట్ అయితేనే నలుగురు మనుషులు తిరుగుతూ ఉంటారు.. నాలుగు ఇళ్లల్లోని వారు పరిచయం ఉంటారు అనుకున్న ఆ కుటుంబంలో గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది.. కానీ ఇక్కడ కూడా వారి కుమార్తెకు.. ఆ చిన్నారికి భద్రత లేదని తేలిపోయింది. దేశం మొత్తం ఈ ఘటనతో షాక్ అవ్వగా.. సిటీలో అపార్ట్ మెంట్లు, గేడెట్ కమ్యూనిటీలో నివాసం ఉంటే వారి గుండెలు అదిరాయి ఈ వార్తతో.. వివరాల్లోకి వెళితే..

ఏడు నెలలుగా పురసవల్కంలోని తాము నివసించే అపార్ట్ మెంట్ లో పనిచేసే వాళ్లే.. మా కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ తల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది. మొదట ఒకరిద్దరు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని భావించినా.. కేసు విచారణ సమయంలో వెలుగు చూస్తున్న విషయాలు విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. 12 ఏళ్ల చిన్నారిపై..7 నెలలుగా అత్యాచారం చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అపార్ట్ మెంట్ లో పని చేసే సెక్యూరిటీ గార్డులు, లిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్, ఫ్లంబర్, కార్పెంటర్.. ఇలా రోజువారీ విధులు నిర్వహించే మగాళ్లు అందరూ కూడా ఆ చిన్నారిపై అత్యాచారం చేశారు. ఇంట్లో పేరంట్స్ కు చెబితే చంపేస్తామని బెదిరించారు. చిన్నారిని కాదు.. ఇంట్లో ఉండే మమ్మీ, డాడీ, అక్కను చంపేస్తామని పలుమార్లు బెదిరించారు. దీంతో ఆ చిన్నారి నోరు విప్పటానికి కూడా భయపడింది. అనారోగ్యం, బాలికలో విపరీతమైన భయం, మార్పులను గమనించిన పేరంట్స్.. పదే పదే ప్రశ్నించటం, కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కూతురు చెప్పే మాటలకు ఆ తల్లి గుండె పగిలింది. భద్రత ఇవ్వాల్సిన వారే.. ఈ విధంగా చేయటంపై కన్నీరు మున్నీరు అయ్యింది.

ఈ ఘటన బయటకు తెలిస్తే కూతురు జీవితం ఏమౌతుందో అని ఆ తల్లి భయపడింది.. కానీ ఇంత కిరాతంగా వ్యవహరించిన వారికి కచ్చితంగా శిక్ష పడాలి అని భావించి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ గేటెడ్ కమ్యూనిటీలోని మిగతా కుటుంబాలు కూడా షాక్ అయ్యాయి. మొత్తం సిబ్బందిని నిర్బంధించారు. పోలీసులకు అప్పగించారు. ఈ కేసుపై సీరియస్ గా ఉన్న పోలీసులు.. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పాత్ర కూడా ఉందని నిర్థారణకు వచ్చారు. వారి కోసం గాలిస్తున్నారు.

విషయం తెలుసుకున్న చెన్నైలోని మహిళా సంఘాలు కూడా భగ్గుమన్నాయి. నిందితులను మాకు అప్పగించండి.. మేం చూసుకుంటాం అంటూ ఆందోళనకు దిగాయి.

Posted in Uncategorized

Latest Updates