చిన్న కేసీఆర్… చిన్నారికి పేరు పెట్టిన మాజీ స్పీకర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనంతో కలిసిపోతున్నారు పార్టీల నాయకులు. పండుగ పూట ఇంటింటా ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తన నియోజకవర్గంలో మాజీ స్పీకర్ మధుసూధనాచారి వాడవాడలా ప్రచారం చేశారు.

ఘనపురo మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మధుసూధనాచారి.. బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన గడ్డం గణేష్, సుమలత దంపతుల రెండవ కుమారునికి పేరు పెట్టారు. టీఆర్ఎస్ , కేసీఆర్ అభిమానులైన వారి కోరిక మేరకు… వారి చిన్న కుమారుడికి “చిన్న కేసీఆర్” అని పేరు పెట్టారు.

Posted in Uncategorized

Latest Updates