చిన్న చూపు చూస్తుందని..భార్యను కత్తితో పొడిచాడు

తనను చిన్న చూపు చూస్తుందని భార్యపై హత్యాయత్నం చేసి, తాను కత్తితో పొడుచుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం ముస్లాయిపల్లిలో జరిగింది. స్థానిక స్కాల్ లో హెచ్ ఎంగా విధులు నిర్వహిస్తున్న కన్యాకుమారి(35), ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రమణారెడ్డి భార్యభర్తలు.వీరికి ఇద్దరు కూతుర్లు.  కొన్నేళ్లుగా వీరి నడుమ భేదాభిప్రాయాలు ఉండగా..బంధువులు సర్ధిచెబుతూ వస్తున్నారు.

అయితే భార్యకు ఉద్యోగం ఉండగా..రమణారెడ్డి ఖాళీగా ఉండటంతో..తనను చిన్నచూపు చూస్తోందని భావించి, బుధవారం (ఏప్రిల్-11) స్కూల్ కి వచ్చాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఓ రూమ్ లో మాట్లాడుకుంటుండగా..కోపంతో రమణారెడ్డి, భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా..మిగతా టీచర్లు రావడంతో.. రమణారెడ్డి తయ చేతిలో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ గ్రామస్థులు ఆస్పత్రికి తరలించిగా.. కన్యాకుమారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates