చిన్న జీయర్ స్వామికి తప్పిన ప్రమాదం

ఆధ్యాత్మిక గురువు త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయ గోపురాన్ని మళ్లీ ప్రతిష్టిస్తుండగా.. ప్రమాదం జరిగింది. ఆలయ గోపురంపై పూజలకోసం.. ప్రత్యేకంగా కర్రలతో నిర్మించిన స్టేజీపైకి స్వాములు, పూజారులు ఎక్కారు. గోపురానికి చిన్నజీయర్ స్వామి.. పూజారులతో కలిసి హారతి ఇస్తున్న టైమ్ లో..  బరువుకు తట్టుకోలేక ఆ కర్రలన్నీ ఒక్కసారిగా కిందకు కుంగిపోయాయి. పూజా వస్తువులు కిందపడిపోయాయి. కుంగిన కర్రలపైనే నిలబడి.. పూజ పూర్తిచేశారు అర్చకులు. చిన్నజీయర్ స్వామి, పూజారులు తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates