చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసేవాళ్లకి ఉరే సరి : నాయిని

చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసేవారికి మరణ శిక్షే కరెక్ట్ అన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. మనుషుల అక్రమ రవాణ అనేది హేయమైన చర్య అన్నారు. ట్రాఫికింగ్ పై వచ్చే కొత్త చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా అఫ్జల్ గంజ్ సెంట్రల్ లైబ్రరీ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి నాయిని పాల్గొన్నారు. మనుషుల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు సీపీ అంజనీ కుమార్. హైదరాబాద్ లో మహిళల భద్రతకు భరోసా ఇస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates