చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం : కృష్ణ

krishnaశ్రీదేవి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. చిన్న వయస్సులోనే శ్రీదేవి చనిపోవడం బాధాకరమన్నారు. చిన్నప్పటి నుంచి శ్రీదేవి తనకు బాగా తెలుసని, తమ ఇంట్లోనే ఎక్కువగా ఆడుకునేదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కృష్ణ. తనతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసిందన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇంత చిన్న వయస్సులోనే చనిపోవటాన్ని నమ్మలేకపోతున్నానన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కృష్ణ.

Posted in Uncategorized

Latest Updates