చిప్కో ఉద్యమానికి 45 ఏళ్లు : ఎందుకు.. ఏమిటి.. ఎలా జరిగిందంటే

GOOGLE

చిప్కో ఉద్యమం.. గూగుల్ సైతం డూడుల్ పెట్టింది. ప్రపంచంవ్యాప్తంగా ఆసక్తి రేపింది. ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ.. చిప్కో ఉద్యమం దేశంలో హరితహారానికి నాంది పలికింది అనటంలో సందేహం లేదు. చెట్లపై ప్రేమ, పర్యావరణంపై మక్కువ ఉన్న గ్రామస్తులు చేపట్టిన ఉద్యమమే దేశం మొత్తాన్ని కదిలించింది. 45 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఉద్యమానికి చిప్కో అని పేరు పెట్టారు. ఎలా జరిగిందో చూద్దాం…

చెట్లను నరకాలంటే.. మమ్మల్ని చంపండి.. ఆ తర్వాత ఆ చెట్లను నరకండి అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం  చమోలి (ఇప్పుడు ఉత్తరాంచల్‌) జిల్లాలో ఉద్యమం మొదలైంది. చెట్లను రక్షించే ఉద్యమంతో ప్రారంభమై.. పర్యావరణ పరిరక్షణగా మారింది. 1973లో చమోలి జిల్లా గోపేశ్వర్‌ లో 300 చెట్లను నరికేయటానికి.. సైమన్‌ అనే కంపెనీకి యూపీ అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. చెట్లను తొలగించి.. ఆ ప్రాంతంలో ఓ కంపెనీ ఏర్పాటు చేయాలని భావించారు. దీనికి గ్రామస్తులు వ్యతిరేకించారు. ఆ 300 చెట్ల చుట్టూ మహిళలు చేయి చేయి పట్టుకుని నిలబడ్డారు. ఆ చెట్లను నరకాలి అంటే.. ముందు మమ్మల్ని చంపి లోపలికి వెళ్లండి అని మహిళలు ఆ ప్రాంతం చుట్టూ నిలబడ్డారు. కొందరు మహిళలు అయితే.. చెట్లను పట్టుకున్నారు. మమ్మల్ని చంపి.. ఈ చెట్లను నరకండి అంటూ అధికారులకు తేల్చి చెప్పారు. చెట్ల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమాన్ని చిప్కోగా పేరుపెట్టారు. చిప్కో అంటే గమనం అని అర్థం వస్తోంది. ఇలా ప్రారంభం అయిన ఉద్యమం దేశవ్యాప్తంగా సాగింది. చిమోలీ గ్రామస్తులు చేపట్టిన ఉద్యమానికి దిగి వచ్చిన అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. చెట్ల నరికివేతపై ఏకంగా నిషేధం విధించింది.

చిప్కో ఉద్యమం ప్రారంభం అయ్యి ఈ రోజుకి 45 సంవత్సరాలు. దీంతో గూగుల్‌ డూడుల్‌ పెట్టింది. మహిళలు చేయి చేయి పట్టుకుని చెట్లను రక్షిస్తున్నట్లుగా నిలబడ్డారు. ఆ ఫొటోతోనే గూగుల్‌ డూడుల్‌ రూపొందించింది. దీంతో చిప్కో అంటే ఏంటీ అని ఎక్కువగా గూగుల్ ను సెర్చ్ చేయటం జరిగింది.

 

Posted in Uncategorized

Latest Updates