చివరి కోరిక తీరకుండానే…

sreeశ్రీదేవి మరణం తో బోనీ కపూర్ కుటుంభం ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. బోనీ కపూర్ కు అన్ని విషయాలలో చేదోడు వాడాడు గా వుండే శ్రీదేవి ఒక్కసారిగా దూరమవ్వడం ఆయనకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. అయితే శ్రీదేవి మరణం విషయంలో ఒక అనుకోని కో ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.

బోనీ కపూర్ కు ఇంతకూ ముందే మోనా అనే ఆమెతో వివాహం జరిగింది. వీరిద్దరికి కుమారుడు అర్జున్ కపూర్. అయితే శ్రీదేవి పరిచయం అయినా తరువాత ఆయన మోనా కు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత శ్రీదేవి ని పెళ్లి చేసుకున్నారు. అయితే మోనా 2012 లో కాన్సర్ తో బాధపడుతూ మృతి చెందారు. అప్పుడు వారి అబ్బాయి అర్జున్ కపూర్ తన తొలి సినిమా ‘ఇషాక్ జాదే’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఇంకో 2 నెలలలో ఆ సినిమా విడుదలవుతుంది. ఆలా ఆమె కుమారుడిని తెరపై చూడకుండానే మృతి చెందింది.

అలాగే శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ తొలి సినిమా ‘ధడాక్’ షూటింగ్ ప్రస్తుతం నిర్విరామంగా జరుగుతుంది. ఈ సినిమా మరో మూడు నెలల్లో విడుదలకు రెడీ అవుతుంది. అయితే తన కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన శ్రీదేవి తన కూతురిని వెండితెర మీద చూడకుండానే మృతి చెందింది. ఇలా బోనీ కపూర్ ఇద్దరి భార్యలు తమ వారసులని వెండి తెరపై చూడకుండానే మృతి చెందడం అందర్నీ కలచి వేస్తుంది

Posted in Uncategorized

Latest Updates