చివరి బస్తా వరకు ఎర్రజొన్న కొనుగోల్లు జరుపుతాం : కవిత

KAVITHAతెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో ఎర్ర జొన్న కోనుగోల్లను జరుపుతామన్నారు ఎంపీ కవిత. గురువారం (ఫిబ్రవరి-15) సెక్రటేరియట్ లో ఎర్రజొన్న పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..రెండు రోజుల క్రితమే ఎర్ర జొన్న కొనుగోలు నిర్ణయం తీసుకున్నామన్నారు.కాంగ్రెస్ నాయకులు  అనవసర రాద్దంతం చేస్తున్నారని..మార్కెట్ యార్డ్ లలో అఖరి బస్తా వరకు ఎర్ర జొన్న కొనుగోల్లు జరుపుతామన్నారు.

గతంలో కనీస మద్దతు ధర కోసం ఆందొళన చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఎర్ర జొన్న రైతులందరిని ఆదుకుంటామన్న కవిత కోనుగోలుపై మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు కవిత. ఈ సమావేశంలో మంత్రి పోచారం తదితరులు పాల్గొని మాట్లాడారు.

Posted in Uncategorized

Latest Updates