చివరి వన్డే: టీమిండియా టార్గెట్- 205 రన్స్

South-Africa-indiaసెంచూరియ‌న్ వేదికగా టీమిండియాతో జరుగున్న ఆరోవన్డేలో దక్షిణాఫ్రికా 204 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. భార‌త్ ముందు 205 ప‌రుగుల టార్గెట్ ను నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన స‌ఫారీలు 46.5 ఓవ‌ర్ల‌లో 204 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. ఖాయా జోండో(54) ,పెహ్లుక్వాయో(34) పరుగులతో రాణించారుడు. మిగిలిన బ్యాట్స్ మెన్లు వ‌చ్చిన‌వారు వ‌చ్చిన‌ట్లే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు . ఆమ్లా(10) , మార్క‌ర‌మ్ (24), డివిలియ‌ర్స్ (30) హెన్రిక్ క్లాసెన్ (22) బెహర్డేన్ (1) మోరీస్ (4 ), మోర్కెల్ (20 ) స్వ‌ల్ప స్కోర్ల‌కే పరిమితమయ్యారు.

భార‌త్ బౌల‌ర్ల‌లో శార్దూల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా… బూమ్రా, చాహ‌ల్ చెరో రెండు వికెట్లు తీశారు. పాండ్యా, కుల‌దీప్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates