చీఫ్ జస్టిస్ సర్వాధికారి : కేసుల కేటాయింపు అతని ఇష్టమని సుప్రీం తీర్పు

బెంచ్‌ లకు కేసుల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలంటూ దాఖలైన పిల్‌ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు(ఏప్రిల్-11) కొట్టేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి అత్యున్నత అధికారంగల వ్యక్తి అని, అతన్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అని ధర్మాసనం తెలిపింది. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ లు ఉన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ తీర్పును చదువుతూ.. ప్రధాన న్యాయమూర్తికి సర్వోన్నత అధికారాలు ఉన్నాయని,  బెంచ్‌ లకు  కేసులను కేటాయించాలన్న విశిష్ట అధికారాలను రాజ్యాంగమే ఆయనకు కల్పించిందన్నారు. సుప్రీంకోర్టు రోస్టర్‌ ను వేయడంలో పూర్తి అధికారాలు చీఫ్ జస్టిస్‌కే ఉన్నాయన్నారు. చీఫ్ జస్టిస్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఈ ఏడాది జనవరిలో నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు  ఆరోపణలు చేసిన తర్వాత అశోక్ పాండే అనే వ్యక్తి ఆ అంశంపై పిల్ దాఖలైన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates