చీర్స్ : ఇవాళ ఇంటర్నేషనల్ బీర్ డే

మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం, ఫ్రెండ్ షిప్ డే, లవర్స్ డే.. అన్నింటికీ ఓ డే ఉంది. అలాగే బీర్ డే కూడా ఉంది. ఆ రోజు ఇవాళే. ఆగస్ట్ 3వ తేదీని అంతర్జాతీయ బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బీర్ లవర్స్. ప్రతి ఏటా ఆగస్ట్ నెల మొదటి శుక్రవారాన్ని బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది ప్రపంచం. అమెరికాలోని కాలిఫోర్నియాలో మొదటగా ఇది మొదలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వేల రకాలు బీర్ ప్లేవర్స్ ఉన్నాయి. బీర్ ను ఇంట్లోనూ తయారు చేసుకుంటారు కొందరు. బార్లీ, రైస్, గోధుమ నుంచి కూడా బీర్ తయారు అవుతుంది. ఇప్పుడు అంటే రసాయనాలతో లక్షల లీటర్లు ఒకేరోజు తయారు చేస్తున్నారు కానీ.. దశాబ్దాల కిందట స్వచ్ఛమైన బీరుకి ఎంతో డిమాండ్ ఉండేది. బీరు ఆరోగ్యానికి కూడా మంచిది అని కొన్ని వాదనలు ఉన్నాయి. బీరు తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయని.. రాళ్లు ఏర్పడవనే ప్రచారం కూడా ఉంది. కొన్ని రకాల బీర్లు క్యాన్సర్ ను కూడా నయం చేస్తాయని, మరికొన్ని రకాల బీర్లు గుండె జబ్బులనూ తగ్గిస్తాయనే ప్రచారం ఉంది. కొన్ని రకాల బీర్లకు కొవ్వును కూడా తగ్గించే గుణం ఉందని చెబుతారు. ఇదంతా ఒకవైపు ఉన్న వాదన మాత్రమే.

బీర్ ఆరోగ్యానికి హానికరం అంటారు. ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురి చేస్తోంది వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తయారు అవుతున్న బీర్లు.. గతంలో కంటే భిన్నమైన రుచి, వాసన కలిగి ఉంటున్నాయని చెబుతున్నారు పెద్దలు. ఆల్కాహాల్ అనేదే ఆరోగ్యానికి మంచికాదని.. అందులో బీర్ కూడా ఒకటి అని చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా మందు ప్రియులు మాత్రం ఇవాళ బీర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

వాల్డ్ బీర్ డే సందర్భంగా దేశంలోని కొన్ని బార్లు, పబ్స్ స్పెషల్ ఆఫర్స్ ప్రకటించాయి. కొందరు డిస్కొంట్లు ఇస్తేంటే.. మరికొందరు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇస్తున్నారు. అసలే వీకెండ్.. అందులోనూ బీర్ డే.. ఎంజాయ్ చేయండి. అయితే డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. పోలీసులు ఉన్నారు జాగ్రత్త…

Posted in Uncategorized

Latest Updates