చుక్కలు చూపించారు : మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 40 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది భారత్. ఓపెనర్ రోహిత్ శర్మ 137 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 పరుగులు, శిఖర్ ధావన్ 40 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. దాంతో మరో పది ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ చేధించింది టీమిండియా.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 268 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే ఆలౌట్ అయింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించాడు. కేవలం 25 పరుగులు ఇచ్చి 6 కీలక వికెట్లు తీశాడు. కెరీర్ లో బెస్ట్ గణాంకాలు నమోదు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు కుల్దీప్. ఈజీ విక్టరీతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. లార్డ్స్ వేదికగా లండన్ లో రేపు రెండో వన్డే జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates