చుట్టాల మాటలు తట్టుకోలేకనే దాడి చేశా : మనోహరచారి

ఇటీవల ఎర్రగడ్డలో నడిరోడ్డుపై కూతరు, అల్లుడిపై కత్తితో దాడి చేసిన మనోహరచారి..చేసిన తప్పును దిద్దుకునే పనిలో పడ్డాడు. మద్యం మత్తులో..  క్షణికావేశంతోనే దాడి చేశానని చెప్పాడు.  ప్రసుత్తం కుమిలిపోతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడట. ఆసుపత్రి పాలైన కూతుర్ని చూడాలని ఉందంటూ.. అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.  కూతురు కూలాంతర ప్రేమ పెళ్లి చేసుకోవడంతో.. బంధువులు సూటి, పోటి మాటలతో రెచ్చగొట్టారని, ఆ కసితోనే కసాయిలా మారి కూతురిపై కత్తితో దాడి చేశానని విచారణలో మనోహరచారి వెల్లడించినట్లు తెలిసింది. ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురిని ఎంత బతిమిలాడినా.. ఇంటికి రాలేదని, దీంతో తన కోపం మరింత పెరిగిందని వెల్లడించినట్లు తెలుస్తోంది. బంధువుల మాటలు, కూతురిపై కోపంతోనే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాని, అయితే సంఘటనా స్థలానికి అల్లుడు కూడా రావడంతో ఇద్దరిపై దాడి చేశానని తెలిపాడు.

తాను చేసిన తప్పునకు చింతిస్తున్నానని, హస్పిటల్ లో ఉన్న కూతుర్ని చూడాలని ఉన్నా.. తాను చేసిన నేరం కట్టిపడేసిందని కన్నీరుమున్నీరయ్యాడట మనోహరచారి. ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురు మాధవి, అల్లుడు సందీప్‌ లపై సెప్టెంబర్- 19వ తేదీ సాయంత్రం నడి రోడ్డుపై మనోహరచారి కొబ్బరి బోండాల కత్తితో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. దాడి తర్వాత ఖైరతాబాద్‌ సమీపంలోని తన బావమరిది ఇంట్లో ఆశ్రయం పొందిన మనోహరచారిని అరెస్టు చేశారు పోలీసులు. హత్యాయత్నం, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి, అతడిని రిమాండ్‌కు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates