చుడీదార్ తో అమ్మవారికి అలంకరణ..పూజారులు సస్పెండ్

tmlఎక్కడైనా దేవతా మూర్తులను పట్టువస్త్రాలు,నగలతో అందంగా ముస్తాబు చేస్తారు. ఆ అమ్మవార్లను భక్తులు..కనులారా తిలకించి పారవశ్యంలో మునిగిపోతుంటారు. తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారిని దర్శించిన భక్తులు ఆశ్చర్య పోయారు. మయిలాడుదురైలోని మయూరనాధ ఆలయంలో అభయాంబికగా వెలసిన అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేశారు పూజారులు. ఆలయంలోని అమ్మవారు చుడీదార్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్వాహకులు… పూజారులు రాజ్, కల్యాణంను సస్పెండ్ చేశారు.

కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో మయిలాడుదురైలోని శివాలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు నెమలి రూపంలో పరమేశ్వరుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates