చూసి పంపండి : వాట్సాప్ అడ్మిన్ కు ఐదు నెలల జైలు

వేరొకరు పంపించిన వాట్సాప్ మెసేజ్ ఫార్వాడ్ చేయడం ద్వారా 5 నెలల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఓ యువకుడు. మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘర్ జిల్లాలోని టలెన్ సిటీలో బీఎస్సీ చదువుతున్న జునైద్ ఖాన్(21)ను  ఫిబ్రవరి-14న IT యాక్ట్, IPC సెక్షన్ 124A కింద పోలీసులు అరెస్ట్ చేశారు. జునైద్ ఖాన్ వాట్సాప్ అడ్మిన్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నాడు.

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఇర్ఫాన్…. అభ్యంతరకరమైన పోస్ట్ ని ఫార్వార్డ్ చేశాడు.  దీంతో కొంతమంది స్ధానికులు టాలెన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. పోలీసులు ఇర్ఫాన్,  అడ్మిన్ లపై వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అడ్మిన్… గ్రూప్ ని వదిలేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి గ్రూప్ అడ్మిన్ అయ్యాడు .కేసు తమ నోటీస్ కు వచ్చే సమయానికి వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ గా జునైద్ ఉన్నాడని, అందుకే అతనిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

జునైద్ ఆ గ్రూప్ లో సభ్యుడిగా మాత్రమే ఉన్నాడని, అడ్మిన్ కాదని అతడి కుటుంబం చెబుతోంది. అభ్యంతరకరమైన పోస్ట్ ని షేర్ చేసిన సమయంలో జునైద్… అడ్మిన్ కాదని జునైద్ తమ్ముడు ఫరూఖ్ ఖాన్ తెలిపారు. కోర్టు బెయిల్ కూడా ఇవ్వకపోవడంతో జునైద్ ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయాడని ఫరూఖ్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates