చూస్తుండగానే క్షణాల్లో : వరదలకు కుప్పకూలిన బ్రిడ్జి

ఏపీ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగావళి నది అయితే ఉగ్రరూపం దాల్చింది. ఈ నదిపై ఉన్న బ్రిడ్జీల పైనుంచి నీళ్లు వెళుతున్నాయి. ఈ సమయంలో రాయగూడ దగ్గర ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

రాయగూడ బ్రిడ్జి కొన్నాళ్లుగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అయినా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద వాహనాలకు అనుమతి లేకపోయినా బైక్స్, కార్లు తిరుగుతూనే ఉన్నాయి. భారీ వర్షాలతో నది ఉప్పొంగింది.. అప్పటికే డేంజర్ గా ఉన్న వంతెన.. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ముందు జాగ్రత్తగా బ్రిడ్జి పైకి ఎవరినీ అనుమతించలేదు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates