చూస్తుండగానే: వాహనాల సంఖ్య కోటి దాటింది

Hyd-Vechilesరోజు రోజుకీ వాహనాల కొనుగోళ్ల సంఖ్య పెరిపోతోంది. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందుతున్న వాహనాలు మార్కెట్లోకి రావడం..వాహన ప్రియులు కూడా కొనేందుకు ఆసక్తి చూపించడంతో వాటి సంఖ్య పెరుగుతోంది. బ్యాంకులు లోన్లు కూడా ఇస్తుండటంతో సమాన్య జనం కూడా టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్స్ ను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాహనాల సంఖ్ పెరగడానికి ఇదీ ఓ కారణం.

రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఉంటే వాహనాలు కోటికిపైగా ఉన్నాయి. ప్రతి నలుగురికీ ఒక వాహనం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సగటున ప్రతీ రోజూ 2 వేల 345 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 1,943 వెహికిల్స్ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏడాదికి సగటున 8.56 లక్షల చొప్పున పెరుగుతున్నాయి. గతేడాలోనే 10,41,883 వాహనాలు వచ్చాయి. ఈ లెక్కన రోజుకు 2,855 వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వాహనాల కొనుగోళ్లు ఎక్కువ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గలగలలాడుతోంది. రాష్ట్ర విభజనకు ముందు అంతంతమాత్రంగా ఉండే ఆదాయం, ప్రస్తుతం గణనీయంగా పెరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు లేకుండా ఉంటే ఇప్పటికి మరో పది లక్షల వాహనాలు పెరిగే అవకాశముండేదంటున్నారు అధికారులు. ఉబెర్‌, ఓలా వంటి సంస్థలు రాష్ట్రంలో సేవలు ప్రారంభించటంతో గత రెండేళ్లలో మోటారు క్యాబ్‌(ట్యాక్సీ)లు సుమారు 1.50 లక్షలకుపైగా పెరిగాయి. రాష్ట్రంలో సుమారు 80 లక్షల సంఖ్యతో టూ వీలర్స్  మొదటి స్థానంలో ఉండగా…సెకండ్ ప్లేస్ లో సొంత అవసరాలకు వినియోగించే కార్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చెబుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 12.5 లక్షల వరకు కార్లు ఉన్నాయి.

వాహనాల పెరుగుదల హైదరాబాద్‌ నగరంలో భారీగా ఉంది. రాష్ట్రం ఏర్పడే సమయంలో నగరంలో 22,02,616 వాహనాలుంటే ప్రస్తుతానికి ఆ సంఖ్య 29,11,799కి పెరిగింది. నాలుగేళ్ల వ్యవధిలో 7,09,183 కొత్త వాహనాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రంలో అన్ని రకాల వాహనాల సంఖ్య 1,06,48,068కి చేరుకుంది. మొదటి సారిగా కోటి సంఖ్యను దాటినట్లయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మార్చి నెలాఖరు వరకు 34,24,328 వాహనాలు పెరిగాయి.  అయితే ఈ వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates