చూస్తూ వెళ్లారే కానీ.. పట్టించుకోలేదు : రోడ్డుపై రక్తపు మడుగులో వృద్దురాలు

manaకేరళలో మానవత్వం మంటగలిసింది. గాయాలతో  రోడ్డుపై పడి ఉన్న మహిళపై ఒక్కరు కూడా కనికరం చూపించలేదు. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా అక్కడున్నవారు వ్యవహరించిన అవమానవీయ ఘటన కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలో జరిగింది.

తిరువనంతపురం జిల్లాలోని కడక్కనూర్ సిటీలో మార్చి 28 బుధవారం ఉదయం 65 ఏళ్ల మహిళ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఓ బైక్ ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తం కారుతూ.. రోడ్డుపై పడిపోయిన ఆ మహిళను ఎవ్వరూ పట్టించుకోలేదు. రోడ్డుపై బస్సులు, కార్లు వెళుతూనే ఉన్నాయి. జనాలు తిరుగుతూనే ఉన్నారు. అందరూ చూస్తూ వెళ్లారేకానీ.. పట్టించుకున్నవారే లేరు. అలా వెళ్లిన వాటిలో ప్రభుత్వ అధికారి వాహనం కూడా ఉంది. స్థానికులు సైతం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు.

అలా ఆమె 4 నిమిషాలు రోడ్డుపైనే పడి ఉంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు గమనించి.. గాయాలతో బాధ పడుతున్న ఆమెను తమ కారులో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. యాక్సిడెంట్ చేసినోడు ఎటూ పట్టించుకోలేదు.. మిగతా వారికి ఏమైందీ.. కనీసం మానవత్వం అయినా లేదా అంటూ అందరూ తిట్టిపోస్తున్నారు..

Posted in Uncategorized

Latest Updates