చెంజర్ల మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

chenjarlaచంజర్ల రోడ్డు ప్రమాద భాదితులను మంత్రి మహేందర్ రెడ్డి పరామర్శించారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం చెంజర్ల దగ్గర మంగళవారం (మే-29) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందగా మరో 14 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం కరీంనగర్ అపోలో రీచ్, ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులను కలిసి మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, ఎండీ రమణారావు పరామర్శించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయడిన వారికి మెరుగైన వైద్యం అందిచనున్నట్లు మంత్రి  తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates