చెంజెర్ల రోడ్డు ప్రమాదం : RTC డ్రైవర్ అరెస్ట్

road-accident-300x155మే 29న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజెర్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి..ఆర్టీసీ  బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. నిన్న సాయంత్రం డ్రైవర్ యుగేంధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

వరంగల్ నుంచి కరీంనగర్ వస్తున్న  హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న రాజస్థాన్ కు చెందిన లారీని చెంజెర్ల దగ్గర ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు చనిపోయారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదటగా ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అనుమానించారు. అయితే బస్సులోని ప్రయాణికుల నుంచి పోలీసులు తీసుకున్న వాంగ్మూలం ప్రకారం.. బస్సు డ్రైవర్ యుగేంధర్ రెడ్డి… బస్సును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపినట్లు తేలింది.  యుగేందర్ రెడ్డిపై గతంలో కూడా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates