చెక్ చేసుకోండి.. : మీకు తెలియకుండానే మీ మొబైల్ లో కొత్త నెంబర్

మీకు తెలియకుండా.. మీ మొబైల్ ఫోన్ లో కొత్తగా ఓ నెంబర్ యాడ్ అయ్యింది. మీరు ఎంటర్ చేయకుండానే.. మీ కాంటాక్ట్ లిస్ట్ లోకి ఆ నెంబర్ చేరిపోయింది. ఆ నెంబర్ ఏదో కాదు.. ఆధార్. టోల్ ఫ్రీ నెంబర్ 1800-300-1947. ప్రస్తుతం ఈ నెంబర్ ను షాట్ కట్ చేసింది యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్ ను 1947గా మార్చింది. మార్చిన ఈ నెంబర్ ను అన్ని టెలికాం ఆపరేటర్లు నేరుగా మీ మొబైల్ లోని ఫోన్ బుక్ లోకి చేర్చేశారు. కస్టమర్ల అంగీకారం లేకుండా ఇది జరిగిపోవటంతో షాక్ అవుతున్నారు వినియోగదారులు.

ఇది జోక్ కాదు.. నా ఫోన్ నా దగ్గరే ఉంది. నేను ఎంటర్ చేయకుండానే నా మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లోకి ఈ నెంబర్ చేరిపోవటం ఆశ్చర్యంగా ఉంది. మిస్టరీగా ఉంది. మీరు కూడా ఓసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి అంటూ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా మందికి ఇలాగే వస్తున్నాయి. ఆధార్ తో మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంది. దీంతో UIDAI ఈ విధంగా చేసి ఉంటుందని టెక్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అయితే దీనిపై ముందస్తు సమాచారం లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన ఫోన్ బుక్ లోకి ఇలా నెంబర్ వచ్చి చేరితే.. మొబైల్ ప్రైవసీ ఎక్కడ ఉంది అని మరికొందరు నిలదీస్తున్నారు.

కొంత మంది మాత్రం ఆధార్ టోల్ ఫ్రీ నెంబర్ 1947 మాత్రం కనిపించటం లేదు. కొన్ని నెట్ వర్క్ సర్వీసులకు మాత్రమే ఇలా వస్తున్నట్లు సమాచారం. దీనిపై ట్విట్టర్ లో వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరు అయితే ఫ్రెంచ్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ ఎలియట్ ఎల్డర్ సన్ ను ఈ విషయంపై ప్రశ్నించారు. ఆధార్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Posted in Uncategorized

Latest Updates