చెక్ చేసుకోవాల్సిందే : మహిళలందరికీ కేన్సర్ పరీక్షలు

cancreదేశంలో 30 ఏళ్లు దాటిన మహిళలందరికీ కేన్సర్‌ పరీక్షలు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల కాలంలో కేన్సర్‌ వ్యాధి తీవ్రత పెరిగిపోవడంతో 30 ఏళ్లు దాటిన మహిళలందరికీ  కేన్సర్ పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న ఈ విధానాన్ని దేశమంతా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరాలని కేంద్రం భావిస్తుంది.  ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి22) ఢిల్లీలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో దేశంలోని 8 ప్రాంతీయ కేన్సర్‌ కేంద్రాల(రీజనల్‌ కేన్సర్‌ సెంటర్లు, ఆర్‌సీసీ) ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది.

Posted in Uncategorized

Latest Updates