చెన్నైకి షాక్ : 34 రన్స్ తో.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

RAINAచెన్నైసూపర్ కింగ్స్ కి ఢిల్లీ డేర్ డెవిల్స్ షాక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ నుంచి ఔటైన ఢిల్లీ.. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన చెన్నైకి శుక్రవారం (మే-18) సొంతగడ్డపై ఓడించింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన శ్రేయాస్ గ్యాంగ్.. చెన్నై పై సూపర్ విక్టరీ కొట్టింది. 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రిషబ్  పంత్  26 బాల్స్ లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 రన్స్ చేశాడు.

ఆల్ రౌండర్  విజయ్  శంకర్  28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 రన్స్ చేసి నాటౌట్  గా నిలిచాడు. చివరలో హర్షల్  పటేల్  16 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 36 రన్స్ చేసి నాటౌట్  గా నిలిచాడు. ఎంగిడి 2 వికెట్లు తీయగా..రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, చాహర్ తలో వికెట్ తీశారు.163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. 29 బాల్స్ ఆడిన అంబటి రాయుడు నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ధోని 23 బంతుల్లో 17 రన్స్ చేయగా..రవీంద్ర జడేజా 27 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ట్రెంట్  బౌల్ట్ , అమిత్ మిశ్రా తలో 2 వికెట్లు తీశారు. సందీప్ లామిచానె, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

Posted in Uncategorized

Latest Updates