చెన్నైలో ఆడనీయకపోయినా..ఫ్యాన్స్ కోసం కప్ తో వెళ్తున్నాం : ధోనీ

DHONIIPL సీజన్ -11లో విజేతగా నిలిచి, మూడుసార్లు IPL కప్ సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆదివారం (మే-27) హైదరాబాద్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై  గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ధోనీ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ టీమ్ గురించి మాట్లాడుతూ..రషీద్‌ లాగే భువనేశ్వర్‌ చాలా తెలివైన బౌలరని.. SRHలో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే  ఒకరు ఎక్కువే ఉన్నారన్నారు.

అయితే మొదట్లో తడబడినా.. పవర్ ప్లే తర్వాత బ్యాటింగ్‌ చాలా బాగా సాగిందన్నారు. బలమైన మిడిలార్డర్‌ ను నమ్ముకున్నామని తెలిపిన ధోనీ.. ప్రతీ విజయం ప్రత్యేకమేనన్నారు. ఏ ఒక్కటో గొప్పదని చెప్పలేనని. నా దృష్టిలో వయసనేది ఒక అంకె మాత్రమేనన్నారు. 33 ఏళ్ల రాయుడు తమ ప్రధాన బ్యాట్స్‌మన్‌. 19–20 ఏళ్ల కుర్రాళ్లు కాకపోయినా మైదానంలో చురుగ్గా ఉండగలవాళ్లే కావాలి అని చెప్పారు ధోనీ. తమకు వయసుకంటే మా ఆటగాళ్ల గురించి, వారి ఫిట్‌ నెస్‌ గురించి చక్కటి అవగాహన ఉందని..  దానికి తగినట్లుగా వ్యూహాలు రూపొందించామన్నారు. చెన్నైలో IPL మ్యాచ్ లు జరగకపోయినా..అభిమానులు తమ కోసం ఎక్కడికైనా వచ్చారన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కప్‌ తో చెన్నైకి తిరిగి వెళుతున్నామన్నారు ధోనీ. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానులను కలుసుకోవాలని ముందే నిర్ణయించుకున్నామని చెప్పాడు ధోనీ.

Posted in Uncategorized

Latest Updates