చెన్నైలో IPL రగడ : స్టేడియంలోకి పాములు వదులుతాం

chapakఈ రోజు(ఏప్రిల్-10) చెన్నైలో జరగనున్న IPL మ్యాచ్ కు నిరసన సెగ తగులుతుంది. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కొన్ని రోజులుగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో చెన్నైలో ఈ రోజు చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మ్చాచ్ ను రద్దు చేయాలంటూ తమిళగ వాళ్వురిమై కచ్చి (TVK) కార్యకర్తలు చపాక్ స్టేడియం బయట ఆందోళన చేస్తున్నారు. కావేరీ మేనేజ్‌ మెంట్ బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రజలు చేపట్టిన నిరసనకు చెన్నై సూపర్ కింగ్స్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రజలు చేపట్టిన నిరసనకు చెన్నై సూపర్ కింగ్స్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  చెన్నైలో IPL నిర్వహణకు వ్యతిరేకంగా తమ పార్టీ, ఇతర సంఘాలు చేతులు కలుపుతాయని TVK చీఫ్ వేల్‌ మురుగన్ తెలిపారు. స్టేడియంలో పాములు వదిలి అల్లర్లు సృష్టిస్తామని హెచ్చరించారు.  మరోవైపు ఇప్పటికే సూపర్‌స్టార్ రజినీకాంత్‌, కమల్ హాసన్ వంటి తమిళహీరోలందరూ కూడా IPL మ్యాచ్ లను చెన్నైలో నిర్వహించడం సరికాదని, ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలతో ధరించి తమ నిరసనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే చెన్నై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నల్ల దుస్తులు వేసుకొచ్చేవారిని స్టేడియంలోకి అనుమతించమని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

Posted in Uncategorized

Latest Updates