చెప్పకుండా పూలు కోసింది : అత్తను చావకొట్టిన కోడలి అరెస్ట్

FLOతన అనుమతి లేకుండా పెరట్లో పూలు కోసిందన్న కారణంతో వృద్దురాలైన అత్తను చితకబాదింది ఓ కోడలు. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఈ దారుణం జరిగింది. వృద్దురాలైన అత్తను కోడలు చితకబాదుతున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సౌత్ కోల్ కతా గరియాకు చెందిన జశోదాపాల్(75) కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో.. కొడుకు ఇంట్లోనే ఉంటుంది. అత్త తమ ఇంట్లో ఉండటం నచ్చని కోడలు స్వప్నపాల్.. రోజూ అత్తను హింసిస్తూ ఉండేది. నీ వల్ల ఏం ఉపయోగం అంటూ అత్తపై చేయి చేసుకునేది. తన అనుమతి లేకుండా పెరట్లో పూలు కోసిందని అత్త ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. విచక్షణారహితంగా అత్తను కొట్టింది కోడలు.

ఈ వ్యవహారాన్నంతా గమనించిన ఓ వ్యక్తి.. ఈ ఘటనకు గల కారణం తెలియదని, తెలుసుకునేంత వరకూ షేర్ చేయండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. గంటల్లోనే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. వెంటనే స్వప్నాపాల్ ను పోలీసులు అరెస్ట్ చేయాలని.. లేకుంటే తామే బుద్ది చెబుతాం అంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. అటువంటి నీచురాలి వల్ల ఆడజాతికే అవమానం అంటూ మహిళలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఈ విషయం పోలీసుల వరకూ చేడంతో రంగంలోకి దిగారు. కోడలు స్వప్నపాల్ ను అరెస్ట్ చేశారు. తన పర్మీషన్ లేకుండా పూలు కోసినందుకు కోపం వచ్చి కొట్టానని చెప్పింది. గతంలో కూడా అనేకసార్లు ఆమెపై భౌతికదాడికి పాల్పడినట్లు స్వప్నాపాల్ అంగీకరించింది. ఆమె అరెస్ట్ తో నెటిజన్లు శాంతించారు..

Posted in Uncategorized

Latest Updates