చెప్పాను.. చేశాను : రైతు రుణమాఫీపైనే యడ్యూరప్ప తొలి సంతకం

RAITHUబీజేపీకి ఎక్కువ సీట్లు అప్పజెప్పిన కర్నాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కర్నాటక సీఎం  యడ్యూరప్ప. బలనిరూపణలో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించినా.. అనైతిక కూటమితో కాంగ్రెస్, జేడీఎస్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు యడ్యూరప్ప.  గురువారం (మే-17) ఉదయం సీఎంగా బాధ్యతలు స్వీకరించాక..ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు లక్ష రూపాయల వరకూ బ్యాంక్ రుణం మాఫీ చేస్తూ మొదటి ఫైల్ పై సంతకం చేశారు యడ్యూరప్ప.

కొటక్ ఇన్ స్టిస్ట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్టు ప్రకారం ప్రస్తుతం భారతదేశంలోని వ్యవసాయ రుణాల్లో 8శాతం కర్ణాటకలోని బ్యాంకుల్లో ఉన్నాయి. కర్ణాటకలోని అన్నీ బ్యాంకుల్లో ఉన్న రుణాలు 1.2 లక్షల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో 81 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. అయితే కేవలం ఒక రైతుకు లక్ష చొప్పున రుణ మాఫీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates