చెప్పులెంతో తెలుసా?…రూ.123 కోట్లు

ఎవ్వరు ఊహించి ఉండరు…చెప్పుల జత కోట్లల్లో ఉంటుందంటే…కాని ఇది సత్యం… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షల జతను ఇవాళ (బుధవారం) దుబాయిలో ఆవిష్కరించనున్నారు. మేలిమిబంగారం…మేలుజాతి వజ్రాలు పొదిగి చేసిన ఈ పాదరక్షల జత ఖరీదెంతో తెలుసా? ఏకంగా రూ.123 కోట్లు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  ‘బుర్జ్‌దుబాయ్‌’లో వీటిని ఆవిష్కరించనున్నారు. మిలమిలాడే మేలిమి బంగారం, మేలుజాతి వజ్రాలతో వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలలు పట్టింది.  యుఏఈకి చెందిన ప్రఖ్యాత బ్రాండ్‌ ‘జాదా దుబాయ్‌’ ప్రముఖ ఆభరణాల సంస్థ ‘ప్యాషన్‌ జువెలర్స్‌’తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు.

వజ్రపు కాంతులీనే పసిడి పాదరక్షలను ఇవాళ లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ఇకపై ఆసక్తి ఉన్న వారు ఇచ్చే పాదాల కొలతల మేరకు ఆర్డరుపై తయారు చేసి అందచేయనున్నట్లు ‘జాదా దుబాయ్‌’ సహవ్యవస్థాపకురాలు, డిజైనరు అయిన మరియా మజారి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కుబేరసమానులైన 50 మంది ప్రముఖులను ఆహ్వానించినట్లుతెలిపింది మరియా.

Posted in Uncategorized

Latest Updates