చెరుకు రైతుకు తీపి కబురు : రూ.8వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

chepకష్టాల్లో ఉన్న చెరుకు పరిశ్రమను కాపాడేందుకు 8 వేల 500 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఖాయిలాపడ్డ, నష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, కంపెనీలను మూసివేతకు సంబంధించిన రివైజ్డ్ గైడ్ లైన్స్ ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఒక టైమ్ బౌండ్ లోగా వాటన్నింటిని మూసివేయాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వాటికి సంబంధించిన భూములను పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగిస్తామన్నారు.

అలాగే అలహాబాద్ దగ్గర గంగా నదిపై ఆరు వరసల బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. దేశవ్యాప్తంగా 3లక్షల సోలార్ స్ట్రీట్ లైట్ల ఏర్పాటుతో పాటు, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 25లక్షల సోలార్ ల్యాంప్ లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

 

Posted in Uncategorized

Latest Updates