చెరువులను తలపిస్తున్న గుజరాత్ గ్రామాలు

గుజరాత్ రాష్ట్రంలో కొద్దిరోజులు కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాలు చెరువులను తలపిస్తున్నారు. సముద్ర తీరంలోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. నవ్ సారీ సమీపంలోని వాసిబోర్సీ గ్రామాన్ని సముద్రం ముంచెత్తింది. ఇళ్లన్నీ నేలమట్టం కాగా… రహదారులన్నీ ధ్వంసం అయ్యాయి. గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఊరంతా మునిగిపోవటంతో కట్టుబట్టలతో  రోడ్లమీదకు వస్తున్నారు స్థానికులు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి విజయ్ రూపాని సమీక్షిస్తున్నారు. వరదల కారణంగా ఢిల్లీ- అహ్మదాబాద్ రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు… 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates