చెరువుల చుట్టూ ఈత, ఖర్జూర చెట్లు : కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల చుట్టూ ఈత, ఖర్జూర చెట్లను నాటేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హరితహారంలో భాగంగా శుక్రవారం (ఆగస్టు-3) బండ్లగూడలో ఏర్పాటు చేసిన గౌడ నేతల సభలో మాట్లాడిన కేటీఆర్..ఖర్జూర చెట్లపై డిపార్ట్ మెంట్ అధికారులు లెక్కలు వేసి, రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఖర్జూర చెట్లు ఉన్నాయని తెలిపారు.

గీతా కార్మికుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఈత, తాటి చెట్లు కొడితే 140 రూపాయలుండేదని..ఇప్పుడు వెయ్యి రూపాయల ఫైన్ విధిస్తున్నామని చెప్పారు. రైతులకు ..రైతుభీమా, రైతుబంధును ప్రవేశపెట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చెరువు చుట్టు ఈత వనాలు, ఖర్జూర చెట్లను నాటేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కులవృత్తులను కాపాడుకోవాలన్నారు. గౌడన్న కోసం డ్రిప్పు పెట్టి, బోరులు వేయిస్తామన్నారు. వైన్స్ షాపుల విషయాల్లోనూ రిజర్వేషన్లను కల్పించేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కళ్లు తాగితే మంచిదని,  నీరాను ఆహార పానీయంగా ప్రమోట్ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో గౌడ భవనం కోసం 5 ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు. గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు.

బీసీ గురుకులాల్లో వేలాది మంది పిల్లలకు విద్యనందిస్తున్నామని, హాస్టల్స్ లో సకల సధుపాయాలను కల్పిస్తున్నారు. ఆసరా పించన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు దేశంలోనే చరిత్రాత్మకం అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర గౌడన్నలందరూ వచ్చే ఎన్నికల్లో కేసీఆరే సీఎం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. గౌడన్నల బాధలను తీర్చిన సీఎం కేసీఆర్.. అన్ని కులాల అభివృద్ధిని కోరుకునే నాయకుడు అని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates