చెరువు నీళ్లలో రష్మిక ఫొటోషూట్.. ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రచారం

 పారవేసిన ప్లాస్టిక్ చెత్తతో సముద్రాలు, సరస్సులు కలుషితం అవుతున్నాయి. వీటి వల్ల నీళ్లలో ఉండే జంతువులతో పాటు.. అకారణంగా వచ్చే సునామీలతో మనిషి మనుగడకు ప్రమాదం ఉంది. ఇందుకు గాను.. గీతాగోవిందం ఫేమ్ రష్మిక మందాన కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ మధ్య రష్మిక బెంగళూరులోని బేలండూర్ సరస్సులో ఫొటో షూట్ చేయడానికి వెళ్లింది. అక్కడి సరస్సులో ఉన్న చెత్తను చూసి మనసువిరిగిన రష్మిక.. ప్రజల్లో అవగాహన కల్పించడానికి సరస్సులోకి దిగి ప్లాస్టిక్ కవర్లతో పాటు తాను కూడా మునిగిపోతున్నట్లు ఫొటో షూట్ చేసింది. సరస్సుల్లో, సముద్రాల్లో పడేసిన కవర్లు మనుషులను కూడా ముంచేస్తాయని అర్థం వచ్చేటట్లు ఈ ఫొటో షూట్ ఉంది. “ఇలాంటి కాలుష్యం ప్ర‌తి చోటా ఉంది. వాటిని నిర్మూలించేందుకు ప్ర‌య‌త్నాలు చేయండి ” అని ర‌ష్మిక ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండతో హిట్ కొట్టిన రష్మిక… ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates