చెలరేగిన పాండ్యా, జడేజా..ఆసీస్ కు భారీ టార్గెట్

కాన్ బెర్రాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది.  50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 రన్స్ చేసింది. ఆస్ట్రేలియాకు 303 భారీ లక్ష్యాన్ని ముందుంచుంది. ఆఖర్లో హార్దిక్ పాండ్యా, జడేజా విజృంభించడంతో ఇండియా భారీ స్కోర్ చేయగల్గింది. భారత్ ఓపెనర్లు శిఖర్ ధావన్  16 ,శుభ్ మన్ గిల్ 33 తక్కువ స్కోర్ కే పరిమితమైనా వీరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ 63  రన్స్  చేసి ఔటయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 76 బంతుల్లో 92, రవీంద్ర జడేజా 50 బంతుల్లో66 తో చెలరేగారు. దీంతో 302 పరుగులు చేయగల్గింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అగర్ కు రెండు వికెట్లు, హజల్ వుడ్, అడమ్ జంఫా, అబట్ లకు తలో వికెట్ పడ్డాయి.

303 టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే ఒక వికెట్ కోల్పోయింది.  లబుషేన్ 7 పరుగులకు ఔటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు  7 ఓవర్లు ముగిసే సరికి 29 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది.

Latest Updates