చేతల్లో చూపించింది : ICICI బ్యాంక్ కు భారీ జరిమానా

icప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం ICICI కు భారీ షాక్ తగిలింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో ICICI కు 59 కోట్ల భారీ జరిమానా విధించింది ఆర్ బీఐ(RBI). ఇందులో భాగంగా మార్చి 26, 2018న నోటీసు జారీ చేసింది. సెక్యూరిటీల అమ్మకంలో RBI గైడ్ లైన్స్ ను బ్యాంక్ ఉల్లఘించినందుకు ఈ పెనాల్టీ విధించినట్టు ఒక ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 46 (4) (i) తో సెక్షన్ 47ఏ (1) (సి)లోని నిబంధనల ప్రకారం ఆర్‌ బీఐ జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండాలని  తెలిపింది. అయితే ఈ చర్య బ్యాంక్‌ వినియోదారులను ప్రభావితం చేయదని తెలిపింది. ఇటీవల నిబంధనల ఉల్లంఘనలపై  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ లకు ఆర్‌బీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
bank

Posted in Uncategorized

Latest Updates