చేతులు కలపబోతున్నారా: రజనీ ఇంటికి కమల్

rajnikamalరాజకీయాల్లో చేతులు కలపబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు రజనీ, కమల్ ఈ రోజు(ఫిబ్రవరి18) సమావేశమయ్యారు. త్వరలో తాను చేయబోయే రాజకీయ యాత్ర గురించి చర్చించడానికి రజనీకాంత్ ఇంటికి వెళ్లారు కమల్‌హాసన్.ఈ నెల 21న పార్టీని ప్రారంభించనున్న కమల్.. ఆ తర్వాత తాను చేయబోయే యాత్రపై రజనీతో చర్చించారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదని, ఓ శ్రేయోభిలాషిగా మాత్రమే రజనీని కలిశానని కమల్ తెలిపాడు. రాష్ట్రంలో యాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు రజనీతో చెప్పాను. యాత్ర మొదలుపెట్టే ముందు నాకు నచ్చిన వ్యక్తులను కలుస్తున్నాను. స్నేహితుడిగానే రజనీని కలిశాను తప్ప అందులో రాజకీయ కోణం లేదు అని కమల్ తెలిపాడు. మరి భవిష్యత్తులోనైనా రజనీతో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కాలమే సమాధానం చెప్పాలని అని కమల్ అన్నాడు. అయితే ఈ భేటీపై రజనీ మాట్లాడుతూ… రాజకీయాల్లోకి కమల్ తమిళ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారని, ఫేమ్ కోసం రాలేదన్నారు. అతడు విజయం సాధించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు రజనీ తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates