చేతులెలా వచ్చాయి : కుక్కల కాళ్లు, మూతులు కట్టేసి పడేశారు

dogఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఈ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తోంది. కొంత మంది వ్యక్తులు కుక్కల కాళ్లు, మూతులను వైర్లు, తాళ్లతో కట్టేసి రోడ్డుపై పడేశారు. కదలటానికి, అరవటానికి వీళ్లేకుండా చేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఏడు, ఎనిమిది కుక్కులకు ఇలా కాళ్లు, మూతులు కట్టేసి రోడ్డుపై పడి ఉండటాన్ని చూసిన కొంత మంది స్థానికులు.. వాటిని విడిపించారు. స్థానికంగా ఉండే ఓ వాచ్ మెన్ ను ప్రశ్నించారు. ఎవరు చేశారు ఈ పని అంటూ నిలదీశారు. అతను తెలియదు అంటూ సమాధానం ఇచ్చారు.

కుక్కులను ఇలా దారుణంగా హింసించటం వెనక ఆ ఏరియాలో నివాసం ఉండే వారి పనే అంటున్నారు. వీధి కుక్కలు ఇళ్లల్లోకి రావటం, రాత్రులు అరవటం కారణంగానే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై పోలీస్ కంప్లయింట్ ఇస్తానని ఆ వీడియోలోని ఓ మహిళ చెబుతోంది. ఇది ఎవరి పని.. ఎందుకు చేశారు అనేది మాత్రం స్పష్టం తెలియరాలేదు. కాకపోతే ఈ ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates