చేనేత వృత్తుల కోసం ‘హ్యాండ్ మేడిన్ ఇండియా’ క్యాంపెయిన్

చేనేత కళాకారులకు అండగా నిలబడాలని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జోరుగా జరుగుతోంది. చేనేత వృత్తిని కాపాడాలని కొంతమంది సోషల్ మీడియాలో దీన్ని మొదలుపెట్టారు. దీనికి సపోర్ట్ గా హ్యాండ్ మేడిన్ ఇండియాతో ఉన్న లోగోని వాట్సాప్ డీపీగా వాడుతున్నారు. అందరూ చేనేత, హస్తకళల వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నారు. కరోనా వల్ల దెబ్బతిన్న సంప్రదాయ వృత్తులను నిలబెట్టడానికి ఇది అవసరం అంటున్నారు. హ్యాండ్ మేడిన్ ఇండియా పేరుతో రూపొందించిన ఓ పోస్టర్ ని షేర్ చేస్తున్నారు. అందరూ దీన్ని ఫాలో అయితే గ్రామీణ ఎకానమీకి చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు.

వ్యవసాయం తర్వాత దేశంలో ఎక్కువమంది ఆధారపడిన పరిశ్రమగా ఉన్న చేనేత, హస్తకళల రంగంలో దాదాపు 3 కోట్ల మంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. దేశంలో సంప్రదాయ కళగా, వృత్తిగా చేనేతకు గుర్తింపు ఉంది. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని పరిశ్రమ ఇది. పొల్యూషన్ తగ్గించడంతో పాటు సంప్రదాయ వృత్తులను, గ్రామీణ ఎకానమీని కాపాడడానికి అందరూ కలిసి రావాలని సోషల్ కాంపెయిన్ నిర్వాహకులు కోరుతున్నారు. స్థానికంగా ఎక్కడికక్కడే ప్రోత్సహించడం వల్ల లోకల్ ఎకానమీ అభివృద్ధి చెందడంతో పాటు సంప్రదాయాన్ని కాపాడుకున్నట్లు అవుతుందని చెబుతున్నారు. ఈ క్యాంపెయిన్ ఒక సంప్రదాయాన్ని, కొన్ని కోట్ల మంది కోసం చేస్తున్నామనీ, అందుకే ఎవరి పేర్లు, ఫొటోలు లేకుండా పోస్టర్లు ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

Hand made in India Campaign in social media for handloom professions

Latest Updates