చేప ప్రసాదం కోసం 2 లక్షల చేపలు : బత్తిని

CHEPA

మృగశిర సందర్భంగా ఆస్తమరోగులు వర ప్రదాయినిగా భావించే చేపమందు ప్రసాదానికి భారీ ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ 2లక్షల చేప పిల్లలను సిద్ధం చేసిందన్నారు… బత్తిని హరినాథ్ గౌడ్. జూన్ 8, 9న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి 9వ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర వరకు అందజేస్తామన్నారు. ప్రసాదం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సహకారంతో  అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం RTC ప్రత్యేక బస్సులను నడుపుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేపమందు కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ మొత్తంలో చేప పిల్లలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు బత్తిని హరినాథ్.

Posted in Uncategorized

Latest Updates