చేప ప్రసాదానికి సర్వం సిద్ధం 

fishఆస్తమా బాధితులకు అందించే… చేప ప్రసాదం పంపిణీకి అంతా రెడీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రసాదం పంపిణినీ ప్రారంభించనున్నారు. ప్రసాదం తీసుకునేందుకు దాదాపు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉంది. ప్రసాదం పంపిణీ కోసం 1 లక్షా 32 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు అధికారులు.  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అస్తమ బాధితులు తరలివస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీకి కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ఒక రోజు ముందే వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు చేప ప్రసాదం కోసం తరలి వచ్చారు.

అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహ నాలను అందుబాటులో ఉంచారు అధికారులు. ప్రసాదం వేయడం కోసం 800 మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates