చేయితో టాయిలెట్ ను క్లీన్ చేసిన ఎంపీ

Janardan-Mishraస్వచ్ఛభారత్ అంటూ నేతలు ప్రచారం చేయడమే కాదు…దాన్ని అక్షరాల ఆచరించి చూపించారు ఓ రాజకీయ నాయకుడు. చేతితో టాయిలెట్‌ను క్లీన్ చేశారు బీజేపీ ఎంపీ జనార్ధన్‌ మిశ్రా. మధ్యప్రదేశ్‌లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఓ స్కూళ్  ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్‌ విద్యార్థులు టాయిలెట్స్ సరిగా  లేకపోవడంతో ఉపయోగించడంలేదని, బయటకే వెళ్తున్నామని ఎంపికి తెలిపారు. వెంటనే వాటిని పరిశీలించిన ఆయన చీపురు చేత పట్టి టాయిలెట్స్‌ను శుభ్రపరిచారు. ఏకంగా తన ఎడమ చేతితో లోపల కూరుకుపోయిన చెత్తను తీసి స్వచ్ఛభారత్‌ ప్రచార కార్యక్రమంలో ఫొజులివ్వడం కాదు.. చేసి చూపించారు. ఈ వీడియోను ఆయనే స్వయంగా ట్వీట్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates